AKP: కార్మికుల హక్కులు ఉల్లంఘిస్తే తిరుగుబాటు తప్పదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు అన్నారు. నర్సీపట్నం మార్కెట్ యార్డులో వచ్చే నెల 5న నర్సీపట్నంలో జరిగే సదస్సుకు సంబంధించి కార్మికులకు బుధవారం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సదస్సులో కార్మికుల సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. కావున ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.