MBNR: జిల్లా కేంద్రంలో ధర్మసమాజ్ పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జూన్ 14న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయా వర్గాల నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకుడు మడివాల కృష్ణ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల దోపిడీ కారణంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డాయని ఆరోపించారు. అలాగే జిల్లావాసులు సభను విజయవంతం చెయ్యాలన్నారు.