MDK: మనోహరాబాద్ మండలం దండుపల్లి పంచాయతీ పరిధి పిట్టలవాడ గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి విచ్చేసిన గాలివానకు ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. పూరి గుడిసెలపై ఏర్పాటు చేసుకున్న కప్పులు ఎగిరిపోయాయి. రాత్రంతా వర్షం, గాలి దుమారానికి గ్రామస్తులు భయానికి గురయ్యారు. పిట్టల వాడ గ్రామస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని పంజా బిక్షపతి డిమాండ్ చేశారు.