TG: బక్రీద్ సందర్భంగా రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీస్ సికింద్రాబాద్కు మే 28న సెలవు ప్రకటించారు. తొలుత బుధవారం సెలవు ప్రకటించి గురువారానికి అపాయింట్మెంట్ స్లాట్లు జారీ చేసిన అధికారులు, బక్రీద్ తేదీ మారడంతో గురువారం స్లాట్లను బుధవారానికి రీ-షెడ్యూల్ చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ పాస్పోర్ట్ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. అభ్యర్థులు షెడ్యూల్ను గమనించాలి.