GNTR: తాడికొండ నియోజకవర్గ పరిధిలో 10 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడు-2026 కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తుళ్లూరు హెచ్ఎస్ఆర్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 1, 2 క్లస్టర్ల సమావేశాన్ని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు.