KMM: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాబోయే రెండు గంటల్లో ఖమ్మం జిల్లాలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని నేడు తెలిపారు. ఓ వైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు అప్డేట్, తెలంగాణ వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.