కోనసీమ: అమలాపురంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ విద్యార్థినికి అబార్షన్ చేయడానికి యత్నించారు. సమాచారం ఇవ్వకుండా అబార్షన్ చేయడానికి ప్రయత్నించడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రాష్ట్ర బాలల హక్కుల కమీషన్ మెంబర్ నాగ మానస ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.