కోనసీమ: పాసర్లపూడి, శివకోడు వద్ద జాతీయ రహదారి వెంబడి 6 మీటర్ల ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లను 12 మీటర్లకు పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం NH ఇంజనీర్లు, ఆర్డీవో, ట్రాన్స్ కో అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ పనులు వేగవంతం చేయాలన్నారు.