TG: ప్రముఖ నటుడు చిరంజీవితో మరోసారి తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పర్సంటేజ్ విధానం, సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ సమస్యలపై ఆయనతో చర్చిస్తున్నారు. తుది నిర్ణయాన్ని ఆయనకు వివరిస్తున్నారు. భేటీకి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు శేఖర్‌రావు, కార్యదర్శి శ్రీధర్, ఎగ్జిబిటర్లు బాలగోవిందరాజు, అనుపమరెడ్డి హాజరయ్యారు. ఈనెల 25న కూడా చిరంజీవితో ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు.