ATP: ముస్లింలకు జిల్లా ఇంఛార్జి మంత్రి టీజీ భరత్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇంఛార్జి కలెక్టర్ విష్ణు చరణ్, ఎస్పీ జగదీష్, ఎంపీ లక్ష్మీనారాయణ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఆవులు, దూడలు, ఒంటెలను వధించవద్దని విజ్ఞప్తి చేశారు.