TG: హైదరాబాద్ సిటీ స్లామ్ 10కే సమ్మర్ రన్-2026లో సీనియర్ అథ్లెట్ దివ్యారెడ్డి బొల్లారెడ్డి విజేతగా నిలిచింది. నెక్లెస్ రోడ్లో జరిగిన ఈ రేసులో 40-49 మహిళల విభాగంలో ఆమె అగ్రస్థానంలో ఉంది. ఇటీవల ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్-2025లో దివ్యారెడ్డి రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు సాధించడం విశేషం.