SRPT: నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన టీడీపీ పార్టీ పండుగ మహానాడు బుధవారం కోదాడలో ఘనంగా నిర్వహించారు. మహానాడు కోఆర్డినేటర్లు ముత్తినేని సైదేశ్వర రావు, ఓరుగంటి ప్రభాకర్ల ఆధ్వర్యంలో వర్చువల్ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈ మహాసభకు ఉమ్మడి సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.