HNK: నవభారతావనికి శాస్త్రీయ దృష్టి కల్పిస్తూ, శాస్త్ర, సాంకేతిక ప్రగతికి నెహ్రూ పునాదులు వేశారని శాయంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి అన్నారు. శాయంపేటలో జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. నెహ్రూ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని బుచ్చిరెడ్డి అన్నారు.