రామ్ చరణ్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై జగపతి బాబు స్పందించాడు. బెంగళూరు ఈవెంట్లో చరణ్ కొన్ని పేర్లు మర్చిపోవడంపై వస్తున్న విమర్శలను తప్పుబట్టాడు. ‘మూవీ ప్రమోషన్ల సమయంలో హీరోలపై డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఒత్తిడి చాలా ఉంటుంది. ఆ టెన్షన్లో చిన్న విషయాలు మర్చిపోవడం సహజం. చరణ్ పడ్డ కష్టాన్ని వదిలేసి, పనిలేని వాళ్లే ఇలాంటి ట్రోల్స్ చేస్తారు’ అంటూ ఫైరయ్యాడు.