WGL: పేద ప్రజల ఆరోగ్య రక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు. బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో 83 మంది లబ్ధిదారులకు రూ.5,01,375 విలువగల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేదల వైద్య ఖర్చులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు.