తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఇవాళ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 9వ అదనపు జిల్లా జడ్జి జి.షణ్ముఖ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యార్లగడ్డ శ్రీలక్ష్మి హాజరై న్యాయవాదులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.