SKLM: ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. పోలాకి మండలం ఈదలవలసలో నిర్వహించిన మినీ మహానాడులో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ మేరకు పార్టీ జెండాను ఎగురవేసి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తుందన్నారు.