AKP: స్వచ్ఛరథానికి పొడి చెత్త ఇచ్చి అవసరమైన నిత్యవసర సరుకులు తీసుకువెళ్లాలని నక్కపల్లి ఎంపీడీవో సీతారామరాజు సూచించారు. జానకయ్యపేట గ్రామంలో స్వచ్ఛ రథం సేవలపై బుధవారం అవగాహన కల్పించారు. రోజుకొక గ్రామంలో స్వచ్ఛ రథం తిరుగుతూ పొడి చెత్తను సేకరిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ రథం గ్రామాల పరిశుభ్రతకు దోహదపడుతున్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.