AP: నెల్లూరు జిల్లా అలిచర్లలో పడవ బోల్తాపడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన ఘటనపై మంత్రి అచ్చెన్నాయడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వేటకు వెళ్లిన బాలమురళి (55), గోవింద్ (44) మృతి చెందారు. మరో మత్స్యకారుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చేపట్టాలని అధికారులను అచ్చెన్న ఆదేశించారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.