SDPT: కోహెడలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాతా రమాబాయి అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. డాక్టర్ వేల్పుల శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. బీ.ఆర్. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు, ఆయన సాధించిన విజయాల వెనుక రమాబాయి చేసిన త్యాగాలు, అందించిన సహకారం మరువలేనివని నాయకులు కొనియాడారు.