AI విప్లవంతో శాంసంగ్ చిప్ విభాగానికి భారీ లాభాలు వచ్చాయి. కంపెనీ ఆదాయం గత త్రైమాసికంలో 49 రెట్లు పెరిగింది. దీంతో సంస్థ తన చిప్ విభాగంలోని సుమారు 78,000 మంది ఉద్యోగులకు సగటున రూ.3.25 కోట్ల బంపర్ బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రణాళికాబద్ధమైన 18 రోజుల సమ్మెను నివారించేందుకు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య జరిగిన చారిత్రాత్మక ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారట.