MDK: రామాయంపేట మండలం కోనాపూర్లోని సాయి గీత రైస్ మిల్లును తహసీల్దార్ రజనీకుమారి సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రాధాన్యత క్రమంలో వెంటనే అన్లోడ్ చేసుకోవాలని మిల్లు నిర్వాహకులను ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, మిల్లుల వద్ద లారీల అన్లోడింగ్ను త్వరగా పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.