MLG: ఏటూరునాగారం మండలం అల్లంవారిఘనపురంలో నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క సహకారంతో రూ. 15 వేల విరాళాన్ని మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం అందజేశారు. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని పేర్కొనగా, గ్రామస్తులు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.