మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూ, సంగీతం అందిస్తున్న మూవీ ‘ఎల్లమ్మ’. తాజాగా ఈ మూవీలో మలయాళ బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక దిల్ రాజు నిర్మాణంలో ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.