ASR: జి.మాడుగుల మండలంలోని అంబాలమామిడి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల ధాటికి గ్రామానికి చెందిన మర్రి చిన్నబ్బాయికి చెందిన రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గోడలు కూలిపోవడంతో ఇంటి సామగ్రి దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.