AKP: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ ముందుకు వెళ్తున్నట్లు పాయకరావుపేట నియోజకవర్గం పార్టీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. నక్కపల్లి కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి మహానాడును ప్రారంభించారు. ఈసారి వినూత్నంగా నిర్వహించే ‘మహానాడు’ను విజయవంతం చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.