ఖమ్మం నగరంలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో బుధవారం సూడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. మహిళలందరినీ ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.