NLR: దగదర్తి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జంపని కుమార్ సాధారణ బదిలీలో భాగంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. ఆత్మకూరు పట్టణంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎస్సై తెలిపారు.