జగిత్యాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి 27వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజ సేవకు, కుటుంబ విలువలకు, త్యాగానికి ప్రతీకగా నిలిచిన మాత రమాబాయి సేవలను గుర్తు చేసుకున్నారు.