SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ కూడలిలో బుధవారం రైతుల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అకాలంగా కురిసిన వర్షంతో ధాన్యం తడిసి ముద్దయిందన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్లలో టార్పాలిటీ కవర్లు గోన సంచులు లేవని మండి పడ్డారు.