ATP: జిల్లాలో గత 24 గంటల్లో మొత్తం 516.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 16.1 మి.మీగా రికార్డ్ అయ్యంది. అత్యధికంగా ఆత్మకూరు మండలంలో 78.0 మి.మీ, బుక్కరాయసముద్రంలో 65.0 మి.మీ చొప్పున భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా రెండు మండలాల్లో భారీ వర్షం, తొమ్మిది మండలాల్లో మోస్తరు వర్షం పడిందని అధికారులు పేర్కొన్నారు.