KRNL: కర్నూలు నగరంలోని మాసూంబాషా దర్గా వద్ద కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఏ.సిరి ఆకస్మికంగా పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ, మ్యాపింగ్ పనుల పురోగతిపై అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. SIR ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.