మార్కాపురం పురపాలక సంఘ కార్యాలయం ముందు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సీఐటీయూ కార్మికులు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రఫీ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. కార్మికుడు తప్పెట్ల శేషులు పేరును అప్కాస్ నుంచి తొలగించారు. దీంతో మూడు నెలలుగా జీతాలు రాలేదని చెప్పుకొచ్చారు.