ఐర్లాండ్‌తో జరుగతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ దూరమయ్యాడు. ఎడమ కాలి తొడ కండరాల గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. హెన్రీ దూరం కావడంతో, కివీస్ తుది జట్టులో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లు నాథన్ స్మిత్, జాక్ ఫౌల్క్స్ ఇప్పుడు పేస్ విభాగాన్ని ముందుండి నడిపించనున్నారు.