PLD: నరసరావుపేట ఇసప్పాలం గ్రామంలోని మూడవ క్లస్టర్లో డిజిటల్ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవిందబాబు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.