AP: ఓటు నమోదు ప్రక్రియపై దృష్టి పెట్టాలని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. ‘SIRపై కూడా జాగ్రత్తగా ఉండడి. వేరే పార్టీ నేతలు తప్పులు చేస్తే ప్రజలు పట్టించుకోరు. కానీ టీడీపీ నేతలు సిగ్నల్ జంప్ చేస్తే ప్రజలు పెద్ద తప్పుగా భావిస్తారు. అది మన పార్టీ క్రెడిబిలిటీ. ఎంత పెద్ద నేత అయినా కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తే ఊరుకోం’ అని హెచ్చరించారు.