BDK: మణుగూరు మండలానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు రూ. 23,25,668 విలువ గల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు.