ప్రకాశం: రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు కోసం కర్లపాలెంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం తెట్టు వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీ పనులను జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు నేడు పరిశీలించారు. నిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు.