ADB: ప్రతి కార్యాలయంలోనూ మహిళా ఉద్యోగులకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం మహిళా ఉద్యోగుల హక్కులు, రక్షణ మార్గదర్శకాలతో పోష్ యాక్ట్ ప్రత్యేక అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు.