ADB: నార్నూర్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు అధ్వానంగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. మహాగావ్ నుంచి మండల కేంద్రానికి వచ్చే రహదారి పక్కన గుంత ఏర్పడడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి పొంచి ఉన్న గుంతను అధికారులు గుర్తించి సైతం పట్టించుకోకపోవటం విశేషం. ఇప్పటికైనా గుంతను పుడ్చాలని ప్రజలు కోరారు.