TG: హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈవీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కూకట్పల్లి డిపోకు 60 ఈవీ బస్సులు కేటాయించామని తెలిపారు. ఆర్టీసీలో అనేక సంస్కరణలు తెచ్చామని వెల్లడించారు. హైదరాబాద్.. ఢిల్లీలా మారవద్దనే ఈవీ బస్సులు తెచ్చామని పేర్కొన్నారు. ఈ బస్సులతో ఆర్థిక భారం నుంచి బయటపడవచ్చని చెప్పారు.