NRPT: మద్దూర్ మండల నూతన ఎంఈవోగా జనార్దన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రాంతీయ విద్యాధికారి (ఆర్జేడీ) సోమిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పనిచేసిన బాలకిష్టప్ప స్వచ్ఛందంగా తప్పుకోవడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. స్థానిక ఇద్దరు హెడ్మాస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో, పక్క మండలం నుంచి విల్లింగ్ ఇచ్చిన జనార్దన్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు.