NZB: కమ్మర్పల్లి మండల కేంద్రంలో సహకార సంఘం పరిధిలోని రైతులకు బుధవారం జీలుగా విత్తనాలను సొసైటీ ఛైర్మన్ రేగుంట దేవేందర్ పంపిణీ చేశారు. 50 శాతం రాయితీపై జీలుగా విత్తనాలు రూ.2,453లకు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల వ్యవసాయాధికారిణి రమ్య శ్రీ, సర్పంచ్ కొత్తపల్లి హారికా అశోక్ తదితరులు పాల్గొన్నారు.