అన్నమయ్య: రాయచోటిలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 7.30 గంటలకు మత గురువు సర్కాజీ సర్పుద్దీన్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించనున్నారు. ముస్లిం సోదరులు ఉదయం 7 గంటలకే ఈద్గాకు చేరుకోవాలని కమిటీ సూచించింది. ఈ సందర్భంగా బెపారి మహమ్మద్ ఖాన్ ముందస్తు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.