NLG: చిట్యాల మండలం వెలిమినేడు రైతులు బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం సర్వే నం. 418లోని తమ భూములకు ప్రభుత్వం తక్కువ ధర నిర్ణయించడాన్ని వారు తప్పుబట్టారు. గతంలో ఎకరాకు రూ.21 లక్షలు ఇస్తామన్నారని, ఇప్పుడు కేవలం రూ.7 లక్షలే ఇస్తామనడం అన్యాయమని వాపోయారు. ప్రస్తుతం భూముల ధర కోట్లలో ఉందని పేర్కొన్నారు.