HNK: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జౌళిశాఖ, చేనేత ఆధ్వర్యంలోని సంఘాల ఓటరు జాబితా ఇప్పటికే సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుండటంతో నేతన్నల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఈ జిల్లాలో సుమారు వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు.