HYDలో వీరనారి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీలో వృక్షశాస్త్రం, పర్యావరణ శాస్త్ర విభాగాధిపతిగా సేవలందిస్తున్న డా.పీ.ఆర్.సుశామకి “బయోడైవర్సిటీ కన్జర్వర్ అవార్డు-2026” లభించింది. జీవ వైవిధ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అరుదైన వృక్ష సంపద కాపాడటంలో ఆమె చేసిన విశేష కృషికి ఈ గౌరవం దక్కింది.