KRNL: ఎమ్మిగనూరులో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే మున్సిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించారు. డ్రైనేజీలు బ్లాక్ అయిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బందితో అడ్డంకులను తొలగింపజేసి మురుగు నీరు నిల్వ కాకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలగరాదన్నారు.