KMM: గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీజ మంగళవారం ఆదేశించారు. అలాగే, వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాలలో తక్షణమే వైద్య శిబిరాలు నిర్వహించాలని అన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు వెంటనే అన్ని గురుకులాలను పరిశీలించి, నీటి ముంపు సమస్యలు ఉంటే గుర్తించి పరిష్కరించాలన్నారు.