PLD: నరసరావుపేట సోపా బజార్లో మురుగు నీరు నిల్వ ఉండటం, గుంతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం హిట్ టీవీ ద్వారా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన వెంటనే స్పందించి సిబ్బందిని అక్కడికి పంపించారు. రోడ్డుపై ఉన్న గుంతలను తొలగించి, కాలువల్లో నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. దీంతో బజార్ ప్రజలు కమిషనర్‌ను అభినందించారు.